న్యూఢిల్లీ: ‘ప్రతి ఒక్కరినీ గౌరవించడం. స్వప్నాల్ని సాకారం చేసుకోవటం. చిరకాల సమస్యను సంతోషంగా, సామరస్యంగా పరిష్కరించు
కోవడం. సమాజంలో సామరస్యాన్ని పెంపొందించడం. ఈ లక్ష్యాల సాధన కోసం మనమంతా కలిసి ముందుకెళ్లాలి’ అని అయోధ్య
వివాద పరిష్కారానికి అత్యున్నత న్యాయస్థానం నియమించిన మధ్యవర్తిత్వ సమితి సభ్యుడు శ్రీశ్రీ
రవి శంకర్ శుక్రవారం
ట్వీట్ చేసారు. ‘అయోధ్య వివాదంలో సామరస్య పరిష్కారానికి ఏ అవకాశాలను వదలొద్దు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే మన మంతా విభేదాలను, అహాన్ని పక్కన బెట్టి సమస్య పరిష్కారానికి ముందుకు రావాలి’ అని రవిశంకర్ పిలుపు నిచ్చారు.