న్యూఢిల్లీ: అయోధ్య వివాద పరిష్కారానికి నియమితమైన మధ్యవర్తిత్వ సమితి
సభ్యుల్లో ఒకరుగా జీవన కళ స్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌ను అత్యున్నత న్యాయ స్థానం నియమించటాన్ని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆక్షేపించారు. ‘అయోధ్యపై ముస్లింలు తమ వాదనను వెనక్కి తీసుకోకుంటే, భారత్ మరో సిరియాగా మారుతుందని గతంలో శ్రీశ్రీ రవిశంకర్ హెచ్చరించారు. కాబట్టి ఆయనకు బదులు తటస్థంగా ఉండే మరో వ్యక్తిని నియమిస్తే బాగుంటుంద’ని పేర్కొన్నారు.