యూట్యూబ్‌లో విడుదల చేసిన టీజర్లకు మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకొని ప్రకంపనలు సృష్టించిన ప్రభాస్ నటిస్తున్న కొత్త చిత్రం సాహో వాణిజ్య పరంగా కూడా అంతేస్థాయిలో ప్రకంపనలు కొత్త రికార్డులు సృష్టిస్తోంది.సాహో చాప్టర్1,చాప్టర్2 టీజర్‌లు విడుదలైన సృష్టించిన సంచలనాలు చూసి ఓవర్‌సీస్ హక్కులను మొత్తంగా కొనేయడానికి దుబయ్‌కు చెందిన ప్రముఖ ఫార్స్ ఫిలిమ్స్ సంస్థ నిర్ణయించుకుంది. చైనా మినహా ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ఇదే సంస్థ సినిమాను విడుదల చేయనుంది.సుమారు రూ.50 కోట్లకు ఓవర్‌సీస్ హక్కులు కొనుగోలు చేసినట్లు సమాచారం.దుబాయ్ కేసనోవాల నుంచి చైనా ఓవర్సీస్ వరకూ ప్రతిదీ అనుభవం ఉన్న అహ్మద్ గోల్ చిన్ సినిమా పంపిణీదారుడు అని తెలుస్తోంది.సూపర్ స్టార్ రజనీకాంత్ `2.ఓ` చిత్రాన్ని రిలీజ్ చేసింది ఈ దిగ్గజ సంస్థనే. సదరు సంస్థ `సాహో` హక్కుల్ని చేజిక్కించుకోవడం సినిమాకి పెద్ద ప్లస్ కానుంది.