కేవలం రెండు సినిమాలతో విజయ్ దేవరకొండ యూత్ ఐకాన్‌గా మారిపోయాడు.అర్జున్‌రెడ్డి విజయంతో దేశమంతా క్రేజ్ సంపాదించుకున్న విజయ్‌ని గత ఏడాది విడుదలైన గీత గోవిందం చిత్రం మరో స్థాయికి తీసుకెళ్లింది.టాక్సీవాలా ముందే లీకయినా భారీగా వసూళ్లు సాధించి విజయ్‌కున్న క్రేజ్‌ను తెలియజేసింది.అదే సమయంలో గీత గోవిందం చిత్రం అంతపెద్ద విజయం సాధించడంలో విజయ్ పాత్ర ఎంత ఉందో హీరోయిన్‌గా నటించిన కొడగు అందం రష్మిక మందన్న పాత్ర కూడా అంతే ఉంది.తనదైన శైలిలో టిపికల్ గర్ల్ పాత్రలో రష్మిక కనబరచిన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.రష్మిక,విజయ్‌ల జంటకు కూడా ప్రేక్షకులు మరింతగా ఫిదా అయ్యారు.ఈ తరుణంలో విజయ్,రష్మికలు జంటగా తెరకెక్కుతున్న కొత్త చిత్రం డియర్ కామ్రెడ్‌పై కూడా అంచనాలు భారీగా నెలకొన్నాయి.ఇప్పటికీ చిత్రీకరణ కూడా దాదాపుగా పూర్తయిందని ఏవో ప్యాచ్‌వర్క్‌లు మినహా చిత్రం మొత్తం పూర్తయిందని సమాచారం.ఈ చిత్రంపై నెలకొన్న అంచనాలను పెంచేస్తూ చిత్ర బృందం శుక్రవారం విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ దక్కుతోంది.ఈనెల17వ తేదీన విడుదల చేయనున్న టీజర్‌తో డియర్ కామ్రెడ్ ప్రచారాలు మొదలుపెట్టనున్నట్లు సమాచారం.తెలుగుతో పాటు తమిళం,మలయాళం భాషలతో పాటు కన్నడలో కూడా డియర్ కామ్రెడ్‌ను విడుదల చేయనున్నారు. శాండల్‌ఉడ్‌లో దశాబ్దాలుగా ఉన్న అనువాద చిత్రాలపై నిషేధాన్ని కొద్ది రోజుల క్రితం ఎత్తేయడంతో కన్నడ భాషలో కూడా విడుదల చేయడానికి నిర్మాతలు సిద్ధమయ్యారు.కన్నడనాట నుంచి వచ్చిన రష్మికకు కన్నడలో విపరీతమైన క్రేజ్ ఉంది.రష్మికతో పాటు విజయ్‌కు కూడా కర్ణాటకలో అభిమానులు ఉండడం పైగా కర్ణాటక రాజధాని బెంగళూరుతో పాటు ముఖ్యమైన నగరాల్లో కూడా తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండడంతో డియర్ కామ్రెడ్ కన్నడలో కూడా భారీ విజయం సొంతం చేసుకుటుందని నిర్మాతలు భావిస్తున్నారు.శుక్రవారం విడుదల చేసిన ఫస్ట్‌పోస్టర్‌పై కూడా నాలుగు భాషలు ముద్రించడం అందుకు తార్కాణం..