లక్నో:సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మెయిన్ పురి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు ఆ పార్టీ శుక్రవారం ప్రకటించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న ఆరుగురు అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసింది. ములాయం మేనల్లుడు ధర్మేంద్ర యాదవ్ బడౌన్ నియోజకవర్గం నుంచి, సోదరుడు, సీనియర్ నాయకుడు రాం గోపాల్ యాదవ్ కుమారుడు అక్షయ్ యాదవ్ ఫిరోజాబాద్ నుంచి పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ యూపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన మరుసటి రోజే సమాజ్ వాదీ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. ఇతర అభ్యర్థులు కమలేష్ కఠారియా (ఈటావా), షబ్బీర్ వాల్మీకి (బహ్రేచ్) భాయ్ లాల్ (రాబర్ట్స్ గంజ్).