తెలంగాణలో కాంగ్రెస్‌కు
త్వరలో మరో ఎదురుదెబ్బ తగలనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కాంగ్రెస్ పార్టీకి
చెందిన నకిరెకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెరాసలో చేరడానికి సిద్ధమైనట్లు సమాచారం.ఎమ్మెల్యేగా
గెలిచినా నియోజకవర్గంలో తమకు ప్రాధాన్యత దక్కడం లేదంటూ లింగయ్య సన్నిహితుల వద్ద వాపోయారట.చెర్వుగట్టు
బ్రహ్మోత్సవాల్లో ప్రొటోకాల్ పాటించకుండా తమను అవమానించారని ఎమ్మెల్యేగా గెలిపించిన
ప్రజలకు ఏమి చేయలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారట.లింగయ్య మనోగతాన్ని పసిగట్టిన
తెరాస నేతలు రంగంలోకి దిగి తమవైపు ఆకర్షించినట్లు సమాచారం.ఈ క్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డితో
ఇప్పటికే రెండు సార్లు జరిగిన చర్చలు సఫలమయ్యాయని మరో రెండు మూడు రోజుల్లో లింగయ్య
కారెక్కనున్నానరంటూ వార్తలు వినిపిస్తున్నాయి.అందుకు తగ్గట్టే లింగయ్య రెండు రోజులుగా
అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.ఫోన్ కూడా పని చేయకపోవడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.ఇదిలా
ఉండగా లింగయ్య తెరాసలో చేరితే కాంగ్రెస్ పార్టీకే కాదు నల్గొండ జిల్లాలో అత్యంత బలీయమైన
నేతలు కోమటరెడ్డి బ్రదర్స్ కూడా అవమానమే.ఎందుకంటే గత ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో
లింగయ్యకు కోమటరెడ్డి బ్రదర్స్ పట్టబట్టి మరీ నకిరేకల్ టికెట్ ఇప్పటించి గెలిపించారు.ఇప్పుడు చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్లో చేరతారనే ప్రచారంతో కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా అప్రమత్తం అయ్యారు. కాంగ్రెస్‌ను వీడవద్దని ఎమ్మెల్యేకు చెప్పినట్టు తెలుస్తోంది. కోమటిరెడ్డి బ్రదర్స్ మందలింపుతో చిరుమర్తి లింగయ్య తన మనసు మార్చుకుంటారా..? అధికార పార్టీ గూటికి చేరిపోతారా.. అనేది ఉమ్మడి నల్గొండ జిల్లా హాట్ టాపిక్‌గా మారింది..