అమరావతి:‘రాఫెల్ అవినీతిని
ఎండగట్టిన ది హిందు పత్రిక ప్రధాన సంపాదకుడు ఎన్. రామ్ పై కేసు పెడతారు. ఇరవై ఏళ్ల పాటు కార్యకర్తలు శ్రమించి సమీకరించిన సమాచారాన్ని కంప్యూటరైజ్ చేసారు. దాన్ని చోరీ చేసి మా ప్రభుత్వం పైనే కేసు పెడతారా? ఓట్లను తొలగిస్తారా? తెలంగాణలో అనుసరించిన వ్యూహాన్నే ఇక్కడ అనుస రిస్తారా?’అని ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ప్రభుత్వం, వైకాపా అధినేత
జగన్మోహన రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం ఇక్కడ ఆయన మాధ్యమ ప్రతి నిధులతో
మాట్లాడారు. కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చ కుండా అణగ దొక్కేందకు ప్రయత్నిస్తోందని, ఐటీ, సీబీఐ వంటి సంస్థలతో దాడులు చేయి స్తోందనని మండి పడ్డారు.
కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలు ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నాయి. కార్యకర్తలు సమాచా రాన్ని సమీకరించటం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు.‘ ఒక ప్రైవేటు సంస్థ సమాచారాన్ని ఏ చట్ట ప్రకారం తీసుకుంటారు? జగన్‌కు హైదరాబాద్‌లో ప్రభుత్వం సహకరిస్తోంది. అక్కడి ఆర్థిక మూలాలను ఉపయోగించుకొని కేసులు పెడతున్నారు. కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలు ఆర్థిక ఉగ్రవాదుల్లా పని చేస్తున్నారు. ఇటువంటి దాడులపై పోరాడు తాం’అని తెలిపారు.