హైదరాబాద్ : నటి జయసుధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
2009 ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన
సంగతి తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి చొరవతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని
ఆమె చెప్పేవారు. ఆయన మరణానంతరం రాజకీయాల్లో మౌనంగా ఉండిపోయారు. తర్వాత టీడీపీలో చేరారు.
ఇప్పుడు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.