తెరాసపై కూడా డేటా చోరీ అనుమానాలు..

తెరాసపై కూడా డేటా చోరీ అనుమానాలు..

డేటా చోరీ కేసు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రోజురోజుకు వివాదం రాజేస్తోంది.తెదేపా డేటా చోరీకి పాల్పడిందంటూ వైసీపీ నేతలు ఫిర్యాదు చేయడం దీనిపై తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్స్‌,బ్లాఫ్రాగ్‌ సంస్థల్లో తనిఖీలు చేయడం మధ్యలో ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు రంగంలోకి దిగడం ఇదంతా ఇరు రాష్ట్రాల మధ్య వివాదం రేపింది.ఈ పరిణామాల మధ్య డేటా చోరీ కేసును తెరాస ప్రభుత్వం సిట్‌కు అప్పగించింది. దీంతో తెరాసను కూడా దెబ్బ తీయాలనే లక్ష్యంగా అన్వేషణ ప్రారంభించిన తెదేపా నేతలు గత ఏడాది తెలంగాణ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌ మిషన్‌ పేరుతో కేటీఆర్‌ ముందుండి ఓ ప్రాజెక్ట్‌ నడిపించారని అది కూడా డేటా చోరీనే అంటూ కొన్ని మీడియా ఛానెళ్లు,పత్రికలు వీడియోలు,కథనాలు ప్రచురించాయి. దక్షిణాఫ్రికా,న్యూసెర్సీ దేశాలకు చెందిన టీఆర్‌ఎస్‌ ఎన్నారై విభాగం రూపొందించిన టీఆర్‌ఎస్‌ మిషన్‌ డాట్‌ కామ్‌ వెబ్‌సైట్‌లో మొత్తం 119 నియోజకవర్గాలకు చెందిన ప్రభుత్వ పథకాల లబ్దిదారుల డేటా అప్‌లోడ్‌ చేశామని ఈ డేటా ద్వారా టీఆర్‌ఎస్‌ వాలంటీర్లు నేరుగా లబ్దిదారులతో మాట్లాడి తెరాస వైపు ఆకర్షించారంటూ ఓ వ్యక్తి వీడయో కాన్ఫరెన్స్‌లో వెల్లడించాడు.నియోజకవర్గాల లబ్ధిదారులు – ఓటర్ల వివరాలను కేంద్ర కార్యాలయం నుంచే వెబ్ సైట్.. యాప్ లో అప్ లోడ్ చేస్తామని టీఆర్ ఎస్ అప్పట్లో కరపత్రంలో పేర్కొంది. ఈ వెబ్ సైట్ – యాప్ లో లబ్ధిదారుల వివరాలు గోప్యంగా ఉంటామని పేర్కొంది. ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన లబ్ధిదారుల డేటా ఈయాప్ లోకి రావడంపై నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు డేటా చోరీ అని ఏపీ ప్రభుత్వం చేసిందే టీఆర్ ఎస్ చేసిందని.. దీనిపైన విచారణ జరపాలని టీడీపీ నేతలు కోరుతున్నారు.ఇది దుమారం రేగడంతో తాజాగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి టీఆర్ ఎస్ మిషన్ యాప్ ను తొలగించారు. వెబ్ సైట్ కూడా పనిచేయడం లేదు. ఐటీ గ్రిడ్స్ పేరిట ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చినట్టే టీడీపీ బయటకు తీసిన ఈ మిషన్ టీఆర్ ఎస్ వ్యవహారం కూడా సంచలనంగా మారింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos