అలియా,రణ్‌బీర్‌పై శివాలెత్తిన కంగన…

  • In Film
  • March 7, 2019
  • 176 Views
అలియా,రణ్‌బీర్‌పై శివాలెత్తిన కంగన…

బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌
కంగన రనౌత్‌ మరోసారి బాలీవుడ్‌ నటులపై ఫైరయ్యారు.పుల్వామా ఉగ్రవాదుల దాడులు,ఉగ్రవాదుల
శిబిరాలపై భారతవాయు సేనల దాడులు తదనంతరం జరుగుతున్న పరిణామాలపై స్పందిచకపోవడంతో బాలీవుడ్‌
నటులు అలియాభట్‌,రణ్‌బీర్‌ కపూర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.నా ఇంట్లో కరెంటు,వాటర్‌
సరఫరాకు ఎటువంటివ ఇబ్బంది లేదు,కొన్ని విషయాల్లో మన ప్రమేయం,సంబంధం లేనపుడు ఎందుకు
స్పందించాలంటూ రణ్‌బీర్‌,అలియాభట్‌లు వ్యాఖ్యానించడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమంటూ
ఆగ్రహం వ్యక్తం చేశారు.మీ ఇంట్లో అన్నీ ఉన్నాయంటే అవన్నీ దేశమే ఇచ్చిందనే విషయం గుర్తుంచుకోవాలి.మీరు
ఉంటున్న ఇళ్లు,తిరుగుతున్న కార్లు,తింటున్న తిండి ఇవన్నీ ప్రజలు పెట్టిన భిక్ష.ఈ దేశం
పౌరుల డబ్బులతోనే నీకు విలాసవంత జీవితం లభిస్తోంది.ఈ దేశం,ప్రజలు లేకుంటే మీరు లేరు’
అంటూ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.కంగన వ్యాఖ్యలపై అలియాభట్‌ స్పందిస్తూ..కంగన
మాట్లాడినంత ఘాటుగా తాను మాట్లాడలేనని కంగన చేసిన ఆరోపణల్లో తమకు తప్పేమి కనిపించలేదని
మాకు అటువంటి ఆలోచన తీరు లేదన్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos