ఓట్ల తొలగింపు సూత్రధారి జగన్

ఓట్ల తొలగింపు సూత్రధారి జగన్

అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల జాబితా నుంచి  59 లక్షల మంది అర్హ ఓటర్ల పేర్ల  తొలగింపు సూత్రధారి వైసిపి అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గురువారం ఆయన ఇక్కడి నుంచి తెదేపా నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘ఫారమ్ 7 దుర్వినియోగం చేశానని జగనే చెప్పారు.  తొలి దశలో 13లక్షల ఓట్ల తొలగింపునకు కుట్ర పన్నారు. రెండు వేల మంది వైసీపీ వాళ్లే ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపునకు ఎనిమిది లక్షల దరఖాస్తులు సమర్పించారు. సకాలంలో  స్పందించి కుతంత్రాన్ని అడ్డుకున్నామని’ విశదీకరించారు. ‘దేశంలో అన్నిపార్టీలకు యాప్‌లు ఉన్నాయి.  టిఆర్ఎస్ మిషన్ యాప్, బీజేపీ యాప్, వైసీపీ యాప్ ఉన్నాయి. తెదేపా  యాప్ పైనే దుష్ప్రచారాన్ని చేస్తున్నారని ఆక్రోశించారు.  జగన్‌ మాయా రాజకీయం మన రాష్ట్రంలో చెల్లదని హెచ్చరించారు.   వైసీపీ పుట్టిందే మోసాలు, నేరాల పైన అని వ్యాఖ్యానించారు. గతంలో  బోగస్ షేర్ల మాయా జాలం చేసిన జనగర్‌ ఇప్పుడు దొంగ ఓట్ల మాయా జాలాన్ని  ప్రారంభించారని ఎద్దేవా చేసారు. ‘రాజ్యాధికారం కోసం వైసీపీ అడ్డ దారులు-తప్పుడు విధానాలపై అప్రమత్తంగా ఉండాల’నివిన్నవించారు. తమ సమాచారాన్ని  దొంగిలించి ఓట్లు వేయాలని తమకే ఫోన్లు చేస్తున్నారని తప్పు పట్టారు. వైకాపా నుంచి ఫోన్లు చేసే వారిని నిలదీయాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. తమ చరవాణి సంఖ్యను ఎవరిచ్చారు? తెదేపా సమాచారాన్ని ఎందుకు చోరీ చేశారని నిలదీయాలి.  దొంగలకు ఓట్లు వేయ బోమని   ధైర్యంగా చెప్పాలని సూచించారు.  నరేంద్ర మోదీ, కేసీఆర్ అండతో జగన్ పెట్రేగిపోతున్నారని దుయ్యబట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos