మరోసారి పత్రిక పతాకశీర్షకలో ఓటుకు నోటు….

మరోసారి పత్రిక పతాకశీర్షకలో ఓటుకు నోటు….

నాలుగేళ్ల క్రితం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచనలం సృష్టించిన ఓటుకు నోటు కేసు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఇప్పట్లో వదిలేలా లేదు.అప్పటి స్టింగ్‌ ఆపరేషన్‌లో అడ్డంగా దొరికిపోయిన రేవంత్‌రెడ్డి ఇతరులు ఇప్పటికీ కోర్టులు చుట్టూ తిరుగుతుండగా చంద్రబాబు తేలు కుట్టిన దొంగలా ఉంటున్నారు.ఓటుకు నోటు కేసు ప్రస్తావన వచ్చిన ప్రతీసారి చంద్రబాబు ఏదోఒక విధంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారనేది నిర్వివాదాంశం. అయితే ప్రముఖ ఆంగ్ల వార్త పత్రిక దక్కన్‌ క్రానికల్‌ ఓటుకు నోటు కేసుకు సంబంధించి తమకు 11 నిమిషాల నిడివికల వీడియో టేపు లభించిందని తెలుపుతూ టేపులో నేతల మధ్య జరిగిన సంభాషణను పూసగుచ్చినట్లు కథనాన్ని మొదటిపేజీలో ప్రచురించింది.ఈ వీడియోలో రేవంత్‌రెడ్డి,స్టీఫెన్‌సన్‌-సెబాస్టియన్‌ల మధ్య జరిగిన సంభాషణ అందులో ఎక్కువగా బాబు అనే పదం వాడడం కనిపిచింది.తెలంగాణలోఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే చంద్రబాబు తప్పకుండా ఆదుకుంటారని ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తామని బాబు హామీ ఇచ్చారంటే రేవంత్‌రెడ్డి స్టీఫెన్‌సన్‌తో చెప్పినట్లు అందులో ఉందని పేర్కొంది. అదేవిధంగా చంద్రబాబు రూ.3.5 కోట్లు మాత్రమే ఇవ్వడానికి అంగీకరించారని అయితే తాను పట్టుబట్టి రూ.5 కోట్లకు పెంచానంటూ సెబాస్టియన్‌ అనే వ్యక్తి స్టీఫెన్‌సన్‌తో చెప్పారని కూడా పేర్కొంది.ఇంత వరకు బాగానే ఉన్నా ఓటుకు నోటు కేసు జరిగిన ఇన్నేళ్ల అనంతరం దక్కన్‌ క్రానికల్‌ ఈ కథనాన్ని ప్రచురించడం సంచలనంతో పాటు పలు అనుమానాలకు కూడా తావిస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos