జనరల్ టికెట్‌తో
స్లీపర్ బోగీలో ప్రయాణిస్తుండగా టికెట్ అడిగినందుకు ప్రయాణీకులు మహిళ ట్రావెలింగ్
టికెట్ ఇన్స్పెక్టర్ను రైలులో నుంచి బయటకు తోసేశారు.సికింద్రబాద్ నుంచి ధానాపూర్
వెళుతున్న పాట్నా ఎక్స్‌ప్రెస్ రైలు కాజీపేట జంక్షన్‌కు చేరుకోగానే ఎస్1 బోగీలో టికెట్
తనిఖీ కోసం వచ్చిన అధికారి నీలిమ అందులో జనరల్ టికెట్లతో కొంతమంది ప్రయాణిస్తుండడాన్ని
గమనించారు.జనరల్ టికెట్‌తో స్లీపర్‌లో ఎక్కినందుకు జరిమానా కట్టాలంటూ సూచించారు. అందుకు
నిరాకరించిన ప్రయాణీకులు నీలిమతో గొడవ పడ్డారు.గొడవ శృతి మించడంతో ప్రయాణీకులు నీలిమను
బయటకు తోసేయడంతో అదుపు తప్పి ప్లాట్‌ఫామ్‌కు,రైలుకు మధ్య నీలిమ కాలు ఇరుక్కుంది.గమనించి
ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ప్రయాణీకులు వెంటనే నీలిమ కాలును బయటకు తీశారు.వెంటనే అక్కడికి
చేరుకున్న రైల్వేసిబ్బంది నీలిమను ఆసుపత్రికి తరలించారు.రైల్వే పోలీసులు నిందితులను
అదుపులోకి తీసుకున్నారు..