ఆ ఉగ్రదాడి పెను ప్రమాదం: యుపి ఉపముఖ్యమంత్రి

ఆ ఉగ్రదాడి పెను ప్రమాదం: యుపి ఉపముఖ్యమంత్రి

రోహతక్:‘ పుల్వామా ఉగ్రదాడి భద్రతా వైఫల్యం కాదు. అది ఓ పెద్ద ప్రమాదం’ అని ఉత్తర ప్రదేవ్ ఉప ముఖ్యమంత్రి , భాజపా సీనియర్ నేత కేశవ్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమంలో సంచలనమైంది. పుల్వామా దాడిలో జరిగిన వారం రోజులకే గత నెల 21న ఆయన మాట్లాడినట్లు పేర్కొన్న వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ‘‘భద్రతా వైఫల్యం లేనే లేదు. సీఆర్‌పీఎఫ్ జవాన్లపై జరిగింది ఓ పెద్ద ప్రమాదం మాత్రమే. సైనిక బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు ప్రధాని ఇప్పటికే చెప్పారు. తీసుకోవాల్సిన చర్యల్ని సైన్యం చేపడుతుంది. ఇక ఈ విషయంలో ప్రధాని చెప్పటానికి ఏమీ లేదు’అని మౌర్య ఈ వీడియోలో వ్యాఖ్యానించారు. పుల్వామా ఉగ్రదాడి ఓ ప్రమాదం అని దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యల పై ప్రధాని మోదీ సహా భాజపా నేతలు కన్నెర్ర చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos