ఆర్జీవీలో ఈ యాంగిల్‌ కూడానా?

  • In Film
  • March 6, 2019
  • 180 Views
ఆర్జీవీలో ఈ యాంగిల్‌ కూడానా?

ఏ వివాదం లేకపోయినా సృష్టించుకొని మరీ వివాదాల్లోకి నిలిచే రామ్‌ గోపాల్‌ వర్మ సామాజిక మాధ్యమాల్లో ఎంత చురుగ్గా ఉంటాడో అందరికి తెలిసిందే. ఎవరిపై ఎప్పుడు ఎందుకు ఎలా స్పందిస్తాడో,ఏం పోస్ట్‌ చేసాడోనని చాలా మంది భయపడుతూ ఉంటారు కూడా.ప్రతీ అంశంపై తనకు నచ్చిన విధంగా పోస్ట్‌లు,ఫోటోలు షేర్‌ చేసే ఆర్‌జీవీ తన కుటుంబ సభ్యుల గురించి మాత్రం చాలా చాలా అరుదుగా పోస్ట్‌ చేస్తుంటాడు.కొద్ది కాలం తన కూతురు చిన్నప్పటి ఫోటో షేర్‌ చేసుకున్న ఆర్జీవీ తాజాగా తన మేన కోడలతో కలసి దిగిన ఫోటోలు షేర్‌ చేసుకున్నాడు.ఇప్పటి వరకు తన మేనకోడలు శ్రావ్య గురించి బయటపెట్టని వర్మ తాజాగా శ్రావ్య గురించి కొన్ని వివరాలు కూడా పోస్ట్‌ చేశాడు.తనో ఫ్యాషన్‌ డిజైనరని ముసలోడైన తనకు కూడా మంచి కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేస్తానని మాటిచ్చిందంటూ కమెంట్‌ చేశాడు.ఇదిలా ఉండగా శ్రావ్య త్రిష,కీర్తిసురేశ్‌,రష్మిక మందన్న, రాశిఖన్నా తదితర హీరోయిన్లతో పాటు సైనా నెహ్వాల్‌కు కూడా కాస్టూమ్స్‌ డిజైనర్‌గా వర్క్‌ చేశారు..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos