తమిళంలో భారీమాస్ ఇమేజ్ ఉన్న హీరోల్లో అజిత్ ముందు వరుసలో ఉంటారు.ఎటువంటి ప్రయోగాలకైనా అజిత్ సిద్ధంగా ఉంటారు.గతంలో ఎన్నో ప్రయోగాత్మక,విభిన్న కథాబలమున్న చిత్రాల్లో నటించిన అజిత్ మరోసారి అటువంటి ప్రయోగాత్మక కథతో నటించిన కొత్త చిత్రానికి సంబంధించి బుధవారం విడుదలైన ఫస్ట్‌లుక్ వైరల్‌గా మారింది.బుధవారం విడుదలైన అజిత్ కొత్త చిత్రం ఫస్ట్‌లుక్ చూస్తుంటే ఇది హిందీ చిత్రం పింక్‌కు రీమేక్‌గా స్పష్టమవుతోంది.శ్రీదేవి చనికపోక ముందు హిందీలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన పింక్ చిత్రాన్ని సౌత్‌లో రీమేక్ చేయాలని అందులోనూ అజిత్‌తో రీమేక్ చేయాలని భావించింది.శ్రీదేవి కోరిక మేరకు బోనీ కపూర్ సౌత్‌లో పింక్ చిత్రాన్ని రీమేక్ చేస్తానంటూ అప్పట్లో ప్రకటించాడు.శ్రీదేవి కోరుకున్నట్లుగానే బోనీ కపూర్ పింక్ చిత్రాన్ని రీమేక్ చేస్తుండగా అజిత్ హీరోగా నటిస్తున్నాడు.ఈ రీమేక్ లో కన్నడ స్టార్ హీరోయిన్ శ్రద్దా శ్రీనాద్ నటిస్తోంది. ఆమెతో పాటు మరో ఇద్దరు అమ్మాయిలు కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఫస్ట్ లుక్ లో అమ్మాయిలు బోనులో ఉండగా అజిత్ లాయర్ కాస్ట్యూమ్స్ లో ఉన్నాడు. కనుక ఇది ‘పింక్’ రీమేక్ అనే విషయంపై క్లారిటీ వచ్చేసింది