రాష్ట్రాన్ని దొంగల పాలు చేయొద్దు

రాష్ట్రాన్ని దొంగల పాలు చేయొద్దు

అమరావతి: ప్రజలు ఏ మాత్రం ఏమర పాటుగా ఉన్నా రాష్ట్రం దొంగల పాలవుతుందని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. బుధవారం తెదేపా నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘తప్పులు చేసి శిక్షలు అనుభవించడం జగన్కు అలవాటు. జగన్ వల్ల ఎందరో కేసుల్లో చిక్కుకుని జీవితాంతం మానసిక క్షోభ అనుభవిస్తున్నారని’ వ్యాఖ్యానించారు. తప్పులు చేసేవాళ్లు, నేరగాళ్లకే వైసీపీలో స్థానం లభిస్తుందని, ఆ పార్టీలో ఉన్న వారి నేరాలు, తప్పులు చేయటం అనివార్యమని పేర్కొన్నారు. 2004-09 లో రౌడీయిజం వల్ల రాష్ట్రానికి అప్రదిష్ట పాలైందని, ప్రస్తుతం రాష్ట్రంలో ఫ్యాక్షనిజాన్ని నియంత్రించినట్లు చెప్పారు. నేరాలు, ఘోరాల్ని వైసీపీ ప్రోత్సహిస్తుండగా తాము అభివృద్ధి, సంక్షేమాల కోసం శ్రమిస్తామన్నారు.జగన్‌ నాయకత్వంలో నానాటికి పెరిగి పోతున్న అచ్చోసిన ఆంబోతుల్ని అణిచి వేస్తామని చెప్పారు. ఓట్ల తొలగింపు కుట్రలో మొదటి ముద్దాయి నిందితుడు వైఎస్ జగనే అని దుయ్యబట్టారు. తప్పును జగన్ స్వయంగా ఒప్పుకున్నారని చెప్పారు. ఓటర్ల జాబితానుంచి పేర్ల తొలగింపునకు 13 లక్షల దరఖాస్తుల్ని పంపారని మండి పడ్డారు బెంగళూరు, హైదరాబాద్ నుంచి ఈ కుట్రలు జరిగాయని ఆరోపించారు. ఓటు హక్కును కోల్పోయిన వారంతా జగన్ ను నిలదీయాలని పిలుపు నిచ్చారు. ఇతరులందరూ తమ పేర్లు జాబితాలో ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవాలని విన్నవించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos