లఖ్నవూ:‘ప్రతి పనినీ ప్రధాని నరేంద్ర మోదీ తన గొప్పతనంగా చెప్పుకుంటారు. ఉగ్ర వాదులను హత మార్చటం శుభవార్తే. ఈ విషయంలో మోదీ మౌనంగా ఉండడం వెనుక ఉన్నఆంతర్యం ఏమిటి?’ అని ప్రశ్నిస్తూ ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి మంగళ వారం ట్విట్ చేసారు.‘భారత వైమానిక దళం దాడిలో 250 మంది ఉగ్రవాదులు హతమయ్యారని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా చెప్పుకొంటున్నారు. అయితే, ఆయన గురువు మోదీ హతమైన ఉగ్రవాదుల సంఖ్యపై మౌనం ఎందుకు వహిస్తున్నారు’అని ప్రశ్నించారు.‘మోదీ పాలనలో దేశంలో ఆర్థిక వృద్ధి ప్రయోజనాలు దేశంలోని పేదలు, కూలీలు, రైతులకు అందడం లేదు. తీవ్ర ఆందోళన చెందాల్సిన విషయమిది. జీడీపీ విషయంలో తప్పుడు వివరాలు చెబుతున్నారని’మరో ట్వీట్లో ఆరోపించారు.