‘గీత’ కటౌట్‌కు క్షీరాభిషేకం..

  • In Film
  • March 5, 2019
  • 167 Views
‘గీత’ కటౌట్‌కు క్షీరాభిషేకం..

హాలీవుడ్‌,బాలీవుడ ఇలా ఏ ఉడ్‌లోనైనా దశాబ్దాలుగా ఇంకా చెప్పాలంటే సినిమాలు పుట్టినతొలి రోజు నుంచే చిత్ర పరిశ్రమల్లో కథనాయికలకు ప్రాధాన్యత,ప్రాముఖ్యత అంతంత మాత్రంగానే ఉంటూ వస్తోంది.అది తెర వెనుకైనా,తెర ముందైనా ఒకే విధమైన ట్రీట్‌మెంట్‌ దక్కుతోంది.90శాతానికి పైగా చిత్రాల్లో హీరోయిన్లు కేవలం హీరోలతో రొమాన్స్‌ చేయడానికి,పాటల్లో ఆడిపాడుతూ అందాలు ఆరబోయడానికి లేదా ప్రేమించమంటూ హీరోల చుట్టూ తిరగడం మినహా కథనాయిక ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో పుష్కరానికి ఒకటి వస్తుంటాయి.అప్పుడప్పుడు ఒసేయ్‌ రాములమ్మ, అశ్విని, మయూరి,అరుంధతి ఇలా వేళ్ల మీద లెక్కపెట్టుకోవచ్చు.ఇక ఇదంతా కాసేపు పక్కన పెడితే అభిమానులు కూడా ఎక్కువగా హీరోలకే ఉంటారు. హీరోల పేరుతో అభిమాన సంఘాలు,తమ హీరోల సినిమాల విడుదల సమయంలో హీరోకు భారీ కటౌట్లు,పాలాభిషేకాలు,కొన్ని చోట్ల మేకలు,కోళ్లను కూడా బలిస్తున్నారు.హీరోయిన్లకు కటౌట్లు ఏర్పాటు చేయడం చాలా చాలా అరుదుగా జరిగే విషయం.ఈ అరుదైన ఫీట్‌ కొడగు అందం రష్మిక మందన్న సాధించింది. తెలుగులో విజయ్‌ దేవరకొండతో నటించిన గీత గోవిందం బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించిన అనంతరం రష్మిక క్రేజ్‌ తారాస్థాయికి చేరుకుంది.బీభత్సమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏర్పడింది.ఈ క్రమంలో కొద్దిగా గ్యాప్‌ తీసుకున్న అనంతరం రష్మిక తన మాతృభాష కన్నడలో నటించిన కొత్త చిత్రం యజమాన విడుదల సందర్భంగా బెంగళూరు నగరంలోని ఓ థియేటర్‌లో రష్మికకు అభిమానులు భారీ కటౌట్‌ ఏర్పాటు చేశారు.కటౌట్‌ ఏర్పాటు చేయడమే కాకుండా కటౌట్‌కు క్షీరాభిషేకం కూడా చేశారు.అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos