హాట్ యాంకర్ బీర్ ఛాలెంజ్…

  • In Film
  • March 5, 2019
  • 209 Views
హాట్ యాంకర్ బీర్ ఛాలెంజ్…

సామాజిక మాధ్యమాలు,చరవాణిల వినియోగం ఎక్కువయ్యాక మనుషుల మధ్య దూరం అమాంతం తగ్గిపోయింది. ఒకప్పుడు మన వీధి చివరన ఉండే పెద్దాయన పేరు కానీ,మన కాలేజీలోనే చదువుతన్న యువకుడు మన వీధి వెనుకే ఉన్నాడనే విషయం తెలియడానికి నెలలు పట్టేది.అటువంటిది కేవలం ఒక్క క్లిక్కుతో ఎక్కడో అమెరికాలో ఉంటున్న వ్యక్తి ఇక్కడ అమలాపురంలో ఉంటున్న మరొక వ్యక్తి స్నేహితులుగా మారిపోతున్నారు.ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం సామాజిక మాధ్యమాల్లో ఛాలెంజ్‌ల పేరుతో పలు రకాల విన్యాసాలు విపరీతంగా సర్క్యులేట్‌ అయ్యాయి. ప్లాంట్‌ ఏ ట్రీ,కికి,ఐస్‌ బకెట్‌ ఇలా ఎన్నో ఛాలెంజ్‌లు సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ప్రతీ ఒక్కరినీ తమవైపు తిప్పుకొన్నాయి.ఈ క్రమంలో కొత్తగా బీర్‌ ఛాలెంజ్‌ తెరపైకి వచ్చింది.బీర్‌ ఛాలెంజ్‌ అంటే బీర్‌  బాటిల్‌ ఎత్తి దించకుండా తాగడం కాదు బీర్లతో స్నానం చేసే ఛాలెంజ్‌.ఇది మొదలు పెట్టింది ఎవరో విదేశీయులు కాదు.బుల్లితెరపై హాట్‌గా కనిపించే యాంకర్‌ శ్రావ్యరెడ్డి.యాంకర్‌గా,నటిగా,మోడల్‌గా ఇప్పటికే పాపులరయిన శ్రావ్య మరింత క్రేజ్‌ పొందడానికి బీర్‌ ఛాలెంజ్‌కు శ్రీకారం చుట్టంది.బీర్‌ ఛాలెంజ్‌ కాన్సెప్ట్‌ చూస్తే..బాత్‌టబ్‌లో పడుకొని తలపై బీరు పోసుకుంటూ బీర్‌బాత్‌ చేయడం.ఇలా కేసుల కొద్దీ బీర్లతో బాత్‌టబ్‌లో పడుకొని శ్రావ్యరెడ్డి ఒక్కో బీర్‌ను తలపై పోసుకుంటూ బీర్‌బాత్‌ చేసి బీర్‌ ఛాలెంజ్‌ చేసింది.ప్రతీవారం ఒక కొత్తరకం బీర్‌తో కొత్త ఛాలెంజ్‌ వీడియో పెడుతుందట. బీర్ ఛాలెంజ్ లో భాగంగా  రీసెంట్ గా ఎనిమిది నిముషాల నిడివి గల వీడియో ను రిలీజ్ చేసింది శ్రావ్య.వీడియో పెట్టడం ఆలస్యం ట్రోలింగ్‌ వీరులు రంగంలోకి దిగి తమదైన శైలిలో కమెంట్లు చేస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వాచ్‌ ది బీర్‌ ఛాలెంజ్‌ వీడియో..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos