బాహుబలికి ముందు ఒక లెక్క బాహుబలి తరువాత ఒక లెక్క రీతిలో రెబల్‌స్టార్ ప్రభాస్ క్రేజు పెరిగింది.ఇంకా చెప్పాలంటే ఏ హాలీవుడ్ నటుడికి తగ్గని విధంగా ప్రభాస్‌కు అంతర్జాతీయస్థాయిలో క్రేజ్ ఏర్పడింది.అందులోనూ అమ్మాయిల్లో ప్రభాస్‌కున్న క్రేజ్ అంతాఇంతా కాదు.ఈ తరుణంలో అత్యంత భారీ వ్యయంతో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం సాహో మేకింగ్ టీజర్లు విడుదలయ్యాక అందులో సరికొత్త స్టైలిష్ ప్రభాస్‌ను చూసిన అనంతరనం క్రేజ్ తారాస్థాయికి చేరుకుంది.సాహో చిత్రీకరణలో భాగంగా ప్రభాస్ ప్రపంచ దేశాలన్నీ చుడుతున్నాడు.ఈ క్రమంలో సాహో చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్లడానికి విమానాశ్రాయానికి చేరుకున్న ప్రభాస్‌ను గమనించిన ఓ లేడీ ఫ్యాన్ తన చుట్టూ వందల మంది ఉన్నారని కెమెరాలు చూస్తున్నాయనే విషయం కూడా మరచిపోయి ప్రభాస్ చెంపపై స్మాష్ షాట్ మెరిపించింది.అనంతరం లేడిపిల్లలా గెంతులేస్తూ తన సంతోషాన్ని వ్యక్తపరచింది.విమానశ్రయంలో ప్రభాస్‌ను చూసిన యువతి వెంటనే ప్రభాస్‌తో ఫోటో దిగింది.అనంతరం తన ఎగ్జయిట్‌మెంట్‌ను దాచుకోలేక ప్రభాస్ బుగ్గపై స్మాష్ షాట్ మెరిపించి ఎగిరి గంతులేసింది.ఆ సీన్ ఎంతో ఫన్నీగా జనాల్లో నవ్వు పుట్టించింది. డార్లింగ్ ప్రభాస్ సైతం ఆ యువతి టచ్ చేసిన చోట బుగ్గ నిమురుకుంటూ సింపుల్ గా నవ్వేశాడు. ఆ మొత్తం సీన్ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం జోరుగా వైరల్ అవుతోంది. ప్రభాస్ ని చెంప దెబ్బ కొట్టిన యువతి! అంటూ యూట్యూబ్ మాధ్యమం ఆటాడేసుకుంటోంది..ఈ వీడియో మీరు ఒకసారి చూసేయండి..