న్యూఢిల్లీ: దేశంలో ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా ఆరో రోజు మంగళవారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ ధర 7 పైసలు, డీజిల్ ధర 10 పైసలు వంతున పెరిగింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.72.24 వద్ద.. డీజిల్ ధర రూ.67.64 వద్ద కొనసాగుతోంది. ముంబైలో పెట్రోల్ ధర రూ.77.87, డీజిల్ ధర రూ.70.86 ; కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.74.33 లీటర్ డీజిల్ రూ.69.43 ; చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.75.02, లీటర్ డీజిల్ రూ.71.49 పలుకుతోంది.