దేశ రక్షణకు పోరాటం అనివార్యం

దేశ రక్షణకు పోరాటం అనివార్యం

కోయంబత్తూరు: భారత్‌  శాంతికి కట్టుబడి ఉన్నప్పటికీ సందర్భోచితంగా తన సత్తాను ప్రదర్శించి తీరుతుందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ తెలిపారు. ఇక్కడకు సమీపంలోని వాయుసేన స్థావరంలో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.  ‘అవసరమైనపుడు  మన భద్రతా బలగాలు సార్వభౌమత్వ రక్షణకు శక్తిని ప్రదర్శిస్తాయి. మనభద్రతా బలగాలు, వైమానిక దళాలు దేశాన్ని రక్షించే క్రమంలో పరిష్కార మార్గాలను ప్రతి బింబించేలా పని చేస్తాయి. ఇటీవల మన వైమానిక దళ సాహసాన్ని చూశాం. ఉగ్రవాద శిబిరాలపై ఐఏఎఫ్ దాడులు చేసింది’ అని పేర్కొన్నారు. ‘భారతీయ వైమానిక దళం వేగమంతంగా  నవీకరణ చెందు తోంది. గతంలో  ప్రస్తుతం  నిస్వార్థ పూరితంగా దేశానికి సేవలందించిన వైమానిక దళ సిబ్బందికి అభినందనలు తెలుపుతున్నా. భారత్‌  మిమ్మల్ని చూసి గర్వపడుతోంది’ అని  రామ్‌నాథ్‌ కోవింద్‌ వ్యాఖ్యా నించారు. ప్రకృతి  విపత్తులు సంభవించిన సమయాల్లోనూ వైమానిక దళం సేవల్నీ  ప్రశంసించారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos