డేటాలో వేలు పెడితే మూలాలు కదులుతాయి: చంద్రబాబు

డేటాలో వేలు పెడితే  మూలాలు కదులుతాయి: చంద్రబాబు

చిత్తూరు: డేటా పేరిట దాడులు చేస్తే  ఎంత మాత్రమూ సహించేదిలేదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా పర్యటనలో ఆయన డేటా దాడుల పై ఆగ్రహించారు. జగన్‌, కేసీఆర్‌ కుమ్మక్కై తెదేపాను దెబ్బతీయాలని ఆలోచిస్తున్నారని ఆరోపించారు. పార్టీ సొంత విషయమైన డేటాలోకి ఇతరులు జోక్యం చేసుకుంటే మూలాలు కదులుతాయని  హెచ్చ రించారు. ఆంధ్రప్రదేశ్‌ డేటాపై కేసులు పెట్టేందుకు తెలంగాణ పోలీసులు ఎవరని ప్రశ్నించారు. వైకాపా నేతల కొందరు  హైదరాబాద్‌  కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని  మండి పడ్డారు. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వంపై దాడి చేయటమంటే  ప్రజలకు ద్రోహం చేసినట్లే నని వ్యాఖ్యానించారు. మన ప్రభుత్వ డేటాను ఎవరో దొంగిలిస్తే హైదరాబాద్‌ పోలీసులు కాపాడతారని ప్రశ్నించారు. దారిన పోయిన దానయ్య చేసిన ఫిర్యాదును పట్టుకుని  ఇక్కడి ఐటీ కంపెనీలపై దాడి చేస్తారాని ప్రశ్నించారు. ‘బిహార్‌ వ్యక్తి  వైకాపాకు కన్సల్టెంట్‌. 8 లక్షల ఓట్లను తొలగించారు. చూస్తుంటే నా ఓటును కూడా తొలగి స్తారేమో’అని  అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos