శ్రీనగర్ : పాకిస్థాన్ శుక్రవారం తెల్లవారు జామున మూడు గంటల సమయంలో అక్నూర్ సెక్టార్‌లో భారత సైనిక శిబిరాలపై పాక్ పదాతి దళాలు మోర్టార్ షెల్స్‌తో దాడులు జరిపింది దాడులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. తెల్లవారు జామున మూడు గంటలకు ఆరంభమైన కాల్పులు ఉదయం 6:30 గంటల వరకు సాగాయి. శనివారం పాక్ పదాతి దళం జరిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు మృతి చెందిన సంగతి తెలిసిందే. సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు మరిన్ని బంక్‌ర్లు ఏర్పాటు చేయాలని జమ్మూకశ్మీర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఫూంచ్, రాజౌరీ జిల్లాల్లో అదనంగా 400 బంక్‌ల నెలలోగా నిర్మించేందుకు ఆ ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది.