ఇస్లామాబాద్ :ముస్లిం ఉగ్ర వాద సంస్థ జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజార్ మరణించినట్లు వెలువడిన వార్తల్లో నిజం లేదని పాక్కు చెందిన జియో ఉర్దూ మాధ్యమ సంస్థ సోమవారం తేట తెల్లం చేసింది. ఆయన ప్రాణాలతో ఉన్నట్లు కుటుంబ సభ్యులు, స్నేహితులు తెలిపినట్లు వివరించింది. మసూద్ ఆరోగ్య స్థితి గతుల గురించి జియో ఉర్దూ ఎలాంటి వివరాలు చెప్పలేదు. మసూద్ అజార్ మనుగడ గురించి పాక్ ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన చేయలేదు. రెండు రోజుల కిందట మసూద్ పాకిస్థాన్లోనే ఉన్నాడని విదేశాంగ మంత్రి ఖురేషి మాధ్యమ ప్రతినిధులకు తెలిపారు. తీవ్ర ఆనారోగ్యంతో ఇంట్లో నుంచి కదల్లేని స్థితిలో ఉన్నారని వివరించారు.