రెండు దశాబ్దాల క్రితం దక్షిణాది సినీ ఇండస్ట్రీని తన శృంగార చిత్రాలతో రఫ్ఫాడించిన షకీలా అప్పట్లో తాను ఓ నిర్మాతకు ప్రేమలేఖ రాసిన విషయం ఇన్నాళ్లకు వెలుగు చూసింది.కొద్ది రోజుల క్రితం ఓ ఇంటర్‌వ్యూలో షకీలా స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.చాలా ఏళ్ల క్రితం మోహన్‌లాల్ హీరోగా రూపొందిన చోటా ముంబై చిత్రాన్ని నిర్మించిన మునియన్ పిల్లరాజు ఈ చిత్రంలో షకీలాకు ఓ చిన్న వేషం ఇచ్చారు.ఈ క్రమంలో షూటింగ్ సమయంలో షకీలా తల్లి హఠాత్తుగా అనారోగ్యానికి గురవడంతో వైద్యం చేయించడానికి డబ్బులు లేకపోవడంతో పిల్లరాజును సహాయం అడిగానన్నారు. అప్పటికీ షకీలాకు సంబంధించిన షూటింగ్ ఇంకా ప్రారంభించనేలేదట.అయినప్పటికీ నిర్మాత డబ్బులు పంపించి సహాయపడడంతో అప్పటి నుంచి షకీలా పిల్లరాజుపై ప్రేమను పెంచుకున్నారట.ఇలా కొద్ది రోజులు గడిచిన అనంతరం తన మనసులో మాట తెలియజేస్తూ షకీలా సదరు నిర్మాతకు ప్రేమలేఖ రాసిందట.అయితే ప్రేమలేఖకు రాజు నుంచి ఎటువంటి స్పందన రాలేదట.ఈ విషయాలన్నీ షకీలా స్వయంగా వెల్లడించడంతో షకీల వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.దీంతో అప్పటి నుంచి నెటిజన్లు నిర్మాత గురించి,షకీలా రాసిన ప్రేమలేఖ గురించి వెతుకులాట ప్రారంభించారు.ఈ విషయం తెలుసుకున్న నిర్మాత రాజు షకీల తల్లి ఆసుపత్రిలో ఉన్నపుడు డబ్బులు పంపించిన మాట వాస్తవమేనన్నారు.అయితే షకీలా తనను ప్రేమించిన విషయం తనకు ఇప్పి వరకు తెలియదని అసలు షకీలా నుంచి తనకు ఎటువంటి ప్రేమలేఖ అందలేదన్నారు.షూటింగ్ ఉన్న రోజుల్లో తన సొంత వాహానంలో వచ్చి షూటింగ్ ముగిసిన అనంతరం అదే వాహనంలో వెళ్లిపోయేదని తనతో ఒక్కమాట కూడా మాట్లాడేది కాదన్నారు..