గత ఏడాది విడుదలైన గీత గోవిందం చిత్రంతో కుర్రకారులో గీతగానే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న కూర్గ్ అందం రష్మిక మందన్న ప్రస్తుత్ దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో క్రేజీ హీరోయిన్‌గా మారింది.యువ హీరోలతో పాటు స్టార్ నటుల చిత్రాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంటూ స్టార్‌హీరోయిన్ పట్టం అందుకునే దిశగా దూసుకెళుతున్నారు.ఇదంతా బాగానే ఉన్నా సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ మాత్రం రష్మికను కొంత చికాకు,ఇబ్బందులకు గురి చేస్తోంది.కన్నడ నటుడు రక్షిత్‌శెట్టితో చేసుకున్న నిశ్చితార్థం రద్దు చేసుకున్న సమయంలో రష్మికపై సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ తారాస్థాయికి చేరుకుంది.ఈ ఒక్క సంఘటనతో రష్మికపై కోపం పెంచుకున్న రక్షిత్‌శెట్టి అభిమానులు,కన్నడ సినీ అభిమానులు రష్మికపై దారుణమైన కమెంట్లు చేశారు.అదొక్కటే కాకుండా చాలా సార్లు వేరే విషయాలలో కూడా రష్మిక ట్రోలింగ్ బారిన పడింది. zhkyఅటువంటి సమయంలో ఎలా ఫీలయ్యారంటూ ఇటీవల రష్మికను ప్రశ్నించగా “వాళ్ళు మమ్మల్ని కేర్ చెయ్యరు. మేము వాళ్ళని కేర్ చెయ్యం. ట్రోల్ చేయడం వారికి ఆనందాన్ని ఇచ్చే పనైతే చేసుకోనివ్వండి” అని తన అభిప్రాయం వెల్లడించారు.తనకు అభిమానులే ఎంతో అండ అని.. వారి మద్దతుతోనే ఈ నెగెటివిటీని ఎదుర్కోగలుగుతున్నానని చెప్పారు..