ఎన్నో అంచనాలు,అనుమానాలతో తెలుగులో ప్రారంభమైన బిగ్‌బాస్ మొదటి సీజన్‌కు యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హొస్ట్ చేయడంతో ఊహించదని ఆదరణతో పాటు టీఆర్‌పీ కూడా దక్కింది.అయితే సినిమాల కారణంగా రెండవ సీజన్‌కు ఎన్టీఆర్ తప్పుకోవడంతో నాని హోస్ట్‌గా వ్యవహరించాడు. నాని కూడా తనదైన శైలిలో షోను నడిపించగా కంటెస్టంట్ల చిల్లర వేషాలు,గొడవల వల్ల బిగ్‌బాస్ రెండవ సీజన్‌పై ప్రజల్లో విముఖత,ఆగ్రహం వ్యక్తమయ్యాయి.అమయితే కౌశల్ ఆర్మీ అంటూ అనూహ్యంగా ఒకటి తెరపైకి రావడంతో చివరి ఐదారు వారాలు రెండవ సీజన్ కొంత ఉద్వేగంగా, ఆసక్తిగా జరిగింది.రెండవ సీజన్‌లో చోటు చేసుకున్న పరిణామాలు,ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న బిగ్‌బాస్ నిర్వాహకులు మూడవ సీజన్‌కు అటువంటి తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు.రెండవ సీజన్ లో ప్రముఖ సెలబ్రెటీలు లేకోవడంతో ప్రేక్షకులు ఆసక్తి చూపించలేదు అనేది ఒక వాదన. అందుకే మూడవ సీజన్ లో సెలబ్రెటీల విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాలని భావిస్తున్నారు. మూడవ సీజన్‌కు సంబంధించి జూన్ నెలలో అధికారిక ప్రకటన వెల్లడించానికి నిర్వాహకులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ జూన్ లో చేసేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 2 ఎక్కడైతే నిర్వహించారో అక్కడే సీజన్ 3 ని కూడా నిర్వహించనున్నారు. సీజన్ 3లో సీనియర్ యాంకర్ ఉదయభాను, జేడీ చక్రవర్తి,యాంకర్ మంజుష, వరుణ్ సందేశ్, పూజిత పొన్నాడ ఇంకా పలువురు సెలబ్రెటీలను ఎంపిక చేసేందుకు బిగ్‌బాస్ నిర్వాహకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈసారి సామాన్యులకు నో ఎంట్రీ అనే ప్రచారం కూడా జరుగుతుంది.ఆగస్టు లేదా సెప్టెంబర్ లో మూడవ సీజన్ ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుండగా హోస్ట్ ఎవరనే విషయంపై ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ లేదు..