త్రివిక్రమ్ న్యూక్లియర్ ఫిజిక్స్‌లో గోల్డ్‌ మెడలిస్టా!!

  • In Film
  • March 4, 2019
  • 167 Views
త్రివిక్రమ్ న్యూక్లియర్ ఫిజిక్స్‌లో గోల్డ్‌ మెడలిస్టా!!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ అందులో భాగంగా రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్నారు.ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలో పర్యటించిన పవన్‌ జిల్లా విద్యార్థులతో సమావేశమయ్యారు.జనసేన అధికారంలోకి వస్తే విద్యావిధానాల్లో తీసుకురానున్న మార్పులు, చేపట్టనున్న విధానాలపై విద్యార్థులకు వివరించారు.సమావేశంలో పవన్‌ సినీ ప్రయాణంపై,ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో ఎదురైన అనుభవాల గురించి కూడా విద్యార్థులతో పంచుకున్నారు.ఈ సందర్భంగా తనకు అత్యంత సన్నిహితుడైన దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.త్రివిక్రమ్‌ మీ అందరికి మాటల రచయితగా, దర్శకుడిగా మాత్రమే తెలుసనని అయితే త్రివిక్రమ్‌ చాలా అరుదైన విద్య అభ్యసించారన్నారు. త్రివిక్రమ్‌ ఎంఎస్సీ న్యూక్లియర్‌ ఫిజక్స్‌ చదివారని అందులో యూనివర్శిటీ నుంచి బంగారు పతకం కూడా అందుకున్నారంటూ తెలపడంతో విద్యార్థులు ఆశ్చర్యానికి గురయ్యారు.పవన్‌కళ్యాణ్‌ వెల్లడించిన ఈ కొత్త విషయం కేవలం విద్యార్థులను మాత్రమే కాకుండా చిత్రవర్గాలను,త్రివిక్రమ్‌ అభిమానులు,ప్రజలను సైతం ఆశ్చర్యపరిచింది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos