గోరఖ్పూర్ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శివరాత్రి పర్వదినాన సోమవారం గోరఖ్పూర్ దేవాలయంలో జనతా దర్బార్ నిర్వహించారు. ముఖ్యమంత్రి కాకముందు యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ దేవాలయంలో జనతా దర్బార్ లు నిర్వహించేవారు. తన కుమార్తెను పెళ్లాడిన బాస్తీ జిల్లా యువకుడు 2017 జూన్ 30న తన కుమార్తెను హతమార్చడమే కాకుండా హైకోర్టు బెయిలుపై విడుదలయ్యాక తన ఇతర కూతుళ్లను కూడా హత్య చేస్తానని బెదిరిస్తున్నాడని రామ శంకర మిశ్రా ఫిర్యాదు చేశారు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటానని ఆదిత్య నాథ్ హామీ ఇచ్చారని రామశంకర్ మిశ్రా చెప్పారు. తమ ప్రాంతంలో రోడ్లు నిర్మించాలని కోరాగా దానికి సానుకూలంగా స్పందించారని చందన్ త్రిపాఠి అనే మరో వ్యక్తి చెప్పారు. ప్రజల సమస్యలను విన్న ఆదిత్య నాథ్ అన్ని సమస్యల్ని ఆయా పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు.