బాగా నిద్రపోతే గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుందని అమెరికాలోని మస్సాచుసెట్స్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిద్రలేమి వల్ల ధమనుల వ్యవస్థ ప్రభావితమై, తద్వారా ఉద్రేకాలు పెరిగి తెల్ల రక్త కణాలు వృద్ధి చెందుతాయని చెప్పారు. కంటి నిండా నిద్రపోయే వారి ఎముక మజ్జల్లో ఉత్పత్తయ్యే రక్త కణాలు ఆరోగ్యంగా ఉంటాయని, దాని వల్ల గుండె కూడా పదిలమవుతుందని వివరించారు. ఎలుకలపై తాము జరిపిన పరిశోధనల్లో ఈ మార్పులను గమనించామని చెప్పారు.