అభినందన అర్థం మారింది

అభినందన అర్థం మారింది

దిల్లీ: ‘అభినందన్’‌ అనే పదానికి ఇప్పుడు ఆ అర్థం మారిపోయిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. శనివారం దిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘భారత్‌ ఏం చేస్తుందో ప్రపంచం గమనిస్తోంది. నిఘంటు పదాల  అర్థాలను మార్చగలిగే శక్తి మన దేశానికి ఉంది. కంగ్రాట్స్‌ చెప్పే క్రమంలో అభినందన్‌ పదాన్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు అభినందన్‌ అర్థమే మారిపోయింది’ అని చమత్కరించారు.  పాక్‌ నుంచి వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ సురక్షితంగా భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన రాకను మోదీ స్వాగతిస్తూ ట్వీట్‌ చేశారు. ఆయన చూపిన అసమాన సాహసం దేశానికి గర్వకారణమని కొనియాడారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos