ముంబై విమానాశ్రయానికి బెదిరింపు  కాల్

ముంబై విమానాశ్రయానికి  శనివారం బెదిరింపు  కాల్ రావటంతో ఆవరణలో ఆందోళన ఆవరించింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి రెండో టర్మినల్‌కు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో మందుగుండు సామగ్రి కోసం టెర్మినల్ 2లో ఎల్3, ఎల్2 కచ్చేరీల తనిఖీ ప్రారంభించారు. అక్కడున్న వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.  మంగళ, గురు, శని వారాలలో నిర్వహించే మర్మమ్మతులు యథాతథంగా కొనసాగాయి. కాల్ వివరాలను పోలీసులు సమీకరిస్తున్నారు. పుల్వామా ఘటన తర్వాత ఇలాంటి బెదిరింపు కాల్స్ సర్వ సాధారణమయ్యాయి.  గత వారం కూడా ఇక్కడి ఎయిర్ ఇండియా కార్యాలయానికి బెదిరింపు కాల్ వచ్చింది. ఉరుకులు పరుగులతో తనిఖీలు చేపట్టిన పోలీసులకు బెదిరింపు కాల్‌ ఉత్తిదేనని తేలడంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos