ఆ ఒక్కడికే అధర చుంబనం..

  • In Film
  • March 2, 2019
  • 255 Views
ఆ ఒక్కడికే అధర చుంబనం..

వెండితెరపై ఎంత
ధారాళంగా అందాలు విరజిమ్మినా ఇప్పటి వరకు ఏచిత్రంలో కూడా మూతిముద్దులకు అవకాశం ఇవ్వలేదు
పాలరాతిశిల్పం తమన్నా భాటియా.దశాబ్దాల కాలం క్రితం ప్రారంభించిన చిత్రపరిశ్రమ ప్రయాణంలో
తెలుగు,తమిళం,హిందీ భాషల్లో నటించిన తమన్న ముద్దు సన్నివేశాలకు దూరంగానే ఉంటూ వస్తోంది.దశాబ్ద
కాలంగా ముఖ్యంగా గత నాలుగైదేళ్లుగా ప్రతీ చిత్ర పరిశ్రమలో చాలా చిత్రాల్లో ముద్దు సన్నివేశాలు
సర్వసాధారణమైనా తమన్నా మాత్రం తాను విధించుకున్న నిబంధనలకు అతిక్రమించడానికి అంగీకరించలేదు.ఏచిత్రంలోనైనా
నటించడానికి అంగీకరించే ముందు నిర్మాతలతో చేసుకునే ఒప్పందంలో ముద్దు సన్నివేశాలు లేకుండా
జాగ్రత్త పడుతూ వచ్చింది.అయితే ఈ నిబంధనలను కేవలం ఒక్క కథనాయకుడికి మాత్రం వర్తించవని
తెలిపింది.గ్రీకు దేవుడిలా ఉండే హిందీచిత్ర పరిశ్రమ నటుడు హృతిక్‌రోషన్‌ విషయంలో మాత్రం
తాను విధించుకున్న ముద్దు నిబంధన సడలిస్తానని తెలిపింది.ఇటీవల ఓ ప్రసార మాధ్యమంలో ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడుతూ.. తమన్నా
మాట్లాడుతూ.. హృతిక్ రోషన్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనకు పెద్ద అభిమానిని. ఒక వేళ అతడితో
సినిమా చేసే అవకాశం వస్తే, అందులో ముద్దు సీన్లు చేయాల్సి వస్తే తప్పకుండా చేస్తానని
తెలిపారు.ఇటీవల ఒకసారి హృతిక్‌రోషన్‌ను కలిసే అవకాశం వచ్చిందని ఆ సమయంలో కంగారుకు
లోనై సరిగా మాట్లాడలేకపోయానన్నారు.నా పరిస్థితి గమనించిన హృతిక్‌ స్వయంగా ఫోటో ఏమైనా
కావాల అని అడగడంతో సంతోషం పట్టలేకపోయానన్నారు.యుక్త వయసులో ఉండగా హృతిక్‌ను కలిసినపుడు
ఎలా సంతోషంగా అనిపించిందో ఇపుడు కూడా అదేవిధమైన సంతోషం కలిగిందన్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos