విశాఖపట్టణం: ప్రధాని పర్యటన భద్రత సాకుతో తమ పార్టీ కార్యక్రమాలను అడ్డుకోవడం దుర్మార్గమని ప్రదేశ్ కాంగ్రెస్ సమితి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి విమర్శించారు. శనివారం ఉదయం ఇక్కడ మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు.‘ముందస్తు అనుమతి తీసుకున్నప్పటికీ మా కార్యక్రమాల్ని జరపకుండా అవరోధాన్ని కల్గించారని‘ దుయ్యబట్టారు. ప్రతి పక్షాలను అడ్డుకోవడమనేది పిరికి పందచర్య, లక్షణమని దుయ్యబట్టారు. ‘ మోదీ సభ జరిగితే చాలా?మా సభలు జరగొద్దా’ అని ప్రశ్నించారు. రైల్వే జోన్ పేరిట ఆంధ్రప్రదేశ్నుకేంద్రం పరిహసించిందని వ్యాఖ్యానించారు. మోదీకి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ఆందోళనల్లో పాల్గొన్నవారందరికీ ధన్యవాదాలు చెప్పారు. ‘సైనికుల త్యాగాలను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు. భాజపా ఒక పెద్ద అబద్ధాల పుట్టని’ అని ధ్వజ మెత్తారు. రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని, ప్రత్యేకహోదా తెచ్చి రాష్ట్రాన్ని కాపాడుతామని భరోసా ఇచ్చారు.