చందా కొచ్చర్‌ కు ఇ.డి.తాఖీదులు

చందా కొచ్చర్‌  కు ఇ.డి.తాఖీదులు

ముంబయి: ఐసీఐసీఐ బ్యాంకు మాజీ ముఖ్య కార్యనిర్వహణాధికారి  చందా కొచ్చర్‌ కు ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) శనివారం తాజాగా సమన్లు జారీ చేసింది. వీడియోకాన్‌కు ఐసీఐసీఐ బ్యాంకు రుణ మంజూరు గురించి  విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. వీడియోకాన్‌ ఎండీ వేణు గోపాల్‌ ధూత్‌ను కూడా విచారణకు హాజరు కావాలని సూచించింది.వీరి ఇళ్లు, కార్యాలయాల్లో శుక్రవారం ఈడీ వీరి నివాసాలు  కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. 2012లో వీడియో కాన్‌ గ్రూప్‌నకు రూ.3250 కోట్ల రుణాల మంజూరుకే ఆమె ముడుపుల్ని స్వీకరించారనేది ఆరోపణ.  సీబీఐ, ఆదాయపు పన్ను శాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఐసీఐసీఐ కూడా స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది. అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో నిర్ధరించిన సీబీఐ వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. రుణ మంజూరు సాయం చేసినందుకు కృతజ్ఞతగా వీడియో కాన్‌ చందా కొచ్చర్‌ భర్త దీపక్‌ కొచ్చర్‌ కు చెందిన కంపెనీల్లో  పెట్టు బడులు పెట్టిన ఆరోపణలు ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos