విశాఖ పట్టణం: ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమ య్యాయి. తెదేపా, వామ పక్ష శ్రేణులు ‘మోదీ గో బ్యాక్’ నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. విశాఖలో మోదీకి వ్యతిరేకంగా పెద్ద పెద్ద పోస్టర్లను
రహదార్ల వెంబడి ఏర్పాటు చేసారు. గాంధీ విగ్రహం వద్ద మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, కిడారి శ్రవణ్, స్థానిక విధానసభ సభ్యులు
పాల్గొన్నారు. మోదీ రాక ఆంతర్యం ఏమిటనీ ప్రశ్నించారు. అదే విగ్రహం వద్ద గతమూడ్రోజులుగా ప్రత్యేక హోదా సాధన సమితి ప్రత్యేక హోదా, విభజన హామీల డిమాండ్లతో రిలే దీక్షలు చేపట్టారు. వామపక్షాలు కూడా నిరసన ప్రదర్శన జరిపింది. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు వ్యతిరేకంగా విజయవాడలో రాష్ట్ర తెలుగు యువత ఆధ్వర్యంలో నల్ల చొక్కాలు, నల్ల జెండాలతో నిరసన తెలిపారు .