ఇస్లామాబాద్:
పాకిస్థాన్ నిర్బంధంలో ఉన్న భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను
శుక్రవారం విడుదల చేయనున్నట్లు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ గురువారం పాకిస్థాన్
పార్లమెంటులో ప్రకటించారు. పాకిస్తాన్ శాంతికి కట్టుబడి ఉందనేదానికి
సూచిగా ఈ చర్య తీసుకున్నట్లు విశదీకరించారు.అభినందన్‌ను విడుదల చేసేందుకు
తాము సిద్ధంగా ఉన్నట్లు పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్
ఖురేషి ప్రకటించిన విషయం తెలిసిందే. అభినందన్‌ను విడుదలకు పాక్‌తో ఎలాంటి
ఒప్పందాన్ని చేసుకోబోమని, బేషరతుగా వెంటనే అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం డిమాండు
చేసింది. దీనిపై పాక్‌తో ఎలాంటి చర్చలు ఉండబోవని అధికార వర్గాలు చెప్పాయి. కాందహర్
విమానం హైజాక్ ఘటన తరహాలో ఇచ్చిపుచ్చుకునేవీ ఉండవని తెలిపింది.