మార్చ్9న ఆర్య పెళ్లి…

  • In Film
  • February 28, 2019
  • 198 Views

కొద్ది కాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న తమిళ హీరో ఆర్య,హీరోయిన్‌ సాయేష సైగల్‌ త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే.వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు ఓకే చెప్పడంతో పాటు పెళ్లికి ఏర్పాట్లు కూడా మొదలు పెట్టారు.మార్చ్‌9వ తేదీన పెళ్లికి ముహూర్తం నిర్ణయించడంతో ఇరువురి కుటుంబ సభ్యులు పెళ్లి పనులు ముమ్మరం చేసారు.ఈ క్రమంలో ఆర్య పెళ్లి కార్డులు పంచుతూ బంధువులు,స్నేహితులను పెళ్లికి ఆహ్వానిస్తున్నాడు. తాజాగా హీరో విశాల్ కు ఆర్య పెళ్లి కార్డు ఇచ్చాడు.ఇదిలా ఉండగా ఆర్య సాహేషాల వివాహం హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హోటల్ లో జరుగబోతున్నట్లుగా తెలుస్తోంది.తమిళనాడుకు చెందిన ఆర్య,ముంబయికి చెందిన సాయేషా వివాహం హైదరాబాద్‌లో జరుగుతుండడంపై తమిళ చిత్ర పరిశ్రమలో చర్చలు జోరుగా సాగుతున్నాయి. అయితే తెలుగు,తమిళ,హిందీ పరిశ్రమల నుంచి స్టార్‌ నటీనటులు,ప్రముఖులు హాజరుకావడానికి హైదరాబాద్‌ అనువైన నగరమని భావించి పెళ్లి ఇక్కడ జరపడానికి నిర్ణయించుకున్నారు.అనువాద చిత్రాలతో పాటు వరుడు చిత్రంలో ప్రతినాయకుడిగా నటించిన ఆర్య తెలుగు ప్రజలకు కూడా సుపరిచితుడే. మొదటి కార్డ్ ను విశాల్ కు ఇచ్చిన నేపథ్యంలో ఆ ఫొటోను విశాల్ షేర్ చేసి.. నాకు ఎంతో ఆప్తుడు హృదయానికి దగ్గరైన వాడు అయిన ఆర్య పెళ్లి చేసుకోబోతున్న సందర్బంగా చాలా సంతోషంగా ఉంది అతడి జీవితం సంతోషంగా ఉండాలంటూ ఆశిస్తూ విశాల్ శుభాకాంక్షలు చెప్పాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos