న్యూ
ఢిల్లీ:భారత్-పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల కారణంగా పాక్ వాణిజ్య
సేవల్ని రద్దు చేయటం భారత్ పశ్చిమ సెక్టార్‌లో విమాన ప్రయాణ ఛార్జీల్ని ప్రభావితం
చేసింది. ఢిల్లీ-ముంబైకి ఎక్కడా ఆగకుండా
నేరుగా ప్రయాణానికి గురువారం పలు విమానాయాన
సంస్థలు తక్కువంటే రూ. ఇరవై వేలు రుసుము,మార్గమధ్యంలో ఒక చోట ఆగేట్లయితే రూ.8,500 వసూలు చేసాయి. న్యూఢిల్లీ-గోవా విమాన చార్జీలు రూ 12,000 నుంచి ప్రారంభమయ్యాయి.
ఢిల్లీ-శ్రీనగర్ మధ్య కేవలం ఒకటి, రెండు సంస్థలు మాత్రమే విమానాలు నడిపేవి. ఇప్పుడు వాటి
సంచారానికీ అవరోధం కలిగింది.