సంఝౌతాకు ఎర్రజెండా

సంఝౌతాకు ఎర్రజెండా

ఇస్లామాబాద్‌: భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నందున  రెండు
దేశాల మధ్య సంచరించే ప్రయాణికుల రైలు – సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ రాకపోకల్ని పాకిస్థాన్‌ రద్దు చేసింది.   దీంతో పాక్‌ నుంచి అటారికి రావాల్సిన భారత ప్రయాణికులు లాహోర్‌ రైల్వే స్టేషన్‌లోనే నిలిచి పో యినట్లు గురువారం పాక్‌ మాధ్యమాలు వెల్లడించాయి.  కరాచీ నుంచి 16 మంది సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ లో బయలు దేరారు.  పాక్ నిర్ణయంతో లాహోర్‌లోనే అనివార్యంగా నిలిచిపోయారని
పేర్కొంది. వారిని ఇతర మార్గాల ద్వారా వాఘా సరిహద్దుకు తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని భారత అధికారులు వెల్లడించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడూ సమీక్షిస్తున్నామన్నారు.  బుధవారం దిల్లీ నుంచి ప్రారంభమైన రైలు భారత చివరి రైల్వే స్టేషన్ అయిన అటారి వద్ద ఆగి పోయింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos