
పుల్వామాలో భారత జవాన్లపై ఉగ్రదాడికి ప్రతీకారంగా భారతవాయుసేన పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలోని ఉగ్రవాద స్థావరాలపై బాంబుల వర్షం కురిపించి 300 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో భారత్‌పై కక్ష్య తీర్చుకోవడానికి భారత గగనతలంలోకి ప్రవేశించిన పాకిస్థాన్ యుద్ద విమానాలను తరిమికొట్టేందుకు ప్రయత్నించే క్రమంలో విమానం కూలిపోవడంతో పొరపాటున పాకిస్థాన్ భూభాగంలో దిగిన వింగ్ కమాండర్‌ను పాకిస్థాన్ సైన్యం అదుపులోకి తీసుకున్నారు. భారత్ కు చెందిన పైలట్ అభినందన్ ను తాము కస్టడీలోకి తీసుకున్నామని ప్రకటించిన పాకిస్థాన్ ఆ పైలట్ కు సంబంధించిన వీడియో విడుదల చేసి పాక్ అందులో తన పేరు అభినందన్ అని – ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్నానని పేర్కొన్నారు.తాజాగా ఎంఐఎం ఎంపీ అసదదుద్దీన్ ఓవైసీ ఆ పైలట్ సురక్షితంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నానని ఈ కష్టకాలంలో అతని కుటుంబం ధైర్యంగా ఉండాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు. అంతేకాదు ఆ పైలట్ బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత పాకిస్థాన్‌దేనని స్పష్టం చేశారు. జెనీవా కన్వెన్షన్స్ లోని ఆర్టికల్ 3 ప్రకారం ఖైదీలను అన్ని దేశాలు మానవతా దృక్పథంతో చూడాలి. సదరు ఐఏఎఫ్ పైలట్ విషయంలో పాకిస్థాన్ ఇలాగే వ్యవహరించాలి. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నా.. పాక్ అతన్ని బాగా చూసుకోవాల్సిన అవసరం ఉంది అని అసద్ ఆ ట్వీట్లో స్పష్టం చేశారు.పుల్వామా దాడిపై పాకిస్థాన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఓవైసీ అనంతరం భారతవాయుసేన జరిపిన ఎయిర్‌స్ట్రైక్స్‌ను అభినందించిన విషయం కూడా తెలిపిందే..