కాసుల రాశులు ఒడిశాకు కాసింతే ఆంధ్రకు

కాసుల రాశులు ఒడిశాకు కాసింతే ఆంధ్రకు

అమరావతి:‘ సరకు రవాణా భారీ రాబడి ఒడిశాకు, ప్రయాణికులు తక్కువ రాబడి మనకా’అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఇక్కడ కోస్తా రైల్వే జోను మంజూరుపై పెదవి విరిచారు.  తెదేపా నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. విశాఖ రైల్వే జోన్ ప్రకటన మోదీ ఆంధ్ర ప్రదేశ్‌ కు చేసిన మరో వంచన, భాజపా తలపెట్టిన మరో దుర్మార్గమని  నిందించారు. కొత్త జొన్‌ ఏర్పాటు వల్ల ఆంధ్ర ప్రదేశ్‌ రూ.7 వేల కోట్ల రాబడిని కోల్పోతుందని ఆక్రోశించారు. రాబడి, సిబ్బంది నియామకాలు  మనకన్నా ఒడిశాకే ఎక్కువని ఆరోపించారు. భాజపా నయ వంచనను ఖండించి రాష్త్ర వ్యాప్తంగా కాగడాలు, నల్ల జెండాలు, నల్ల బెలూన్లు, నల్ల చొక్కాలతో ప్రదర్శరనల్ని చేయాలని   పిలుపునిచ్చారు.  ఇచ్చిన హామీలన్నింటినీ ఈడేర్చేంత వరకూ ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్ర ప్రదేశ్‌లో అడుగు పెట్టే హక్కే లేదని తేల్చి చెప్పారు. కొత్త రైల్వే జోన్ ఇచ్చారని వైకాపా నందాన్ని వ్యక్తం చేస్తూ మోదీ చేసిన  మోసాన్ని కప్పి పుచ్చేందుకు తంటాలు పడుతోందని మండిపడ్డారు. బుధవారం  అమరావతిలో జగన్ గృహ ప్రవేశం చేసిన  మరుసటి రోజే హైదరాబాద్ వెళ్లారని తప్పుబట్టారు. జగన్‌ ఎన్నటికీ  రాష్ట్రంలో నివశించబోరని జోస్యం చెప్పారు. జగన్‌కు నిలకడ, విశ్వసనీయత లేదని వ్యాఖ్యానించారు.

       మరికొందరు నేతల్ని విధానపరిషత్తు
సభ్యులుగా నియమించనున్నట్లు ప్రకటించారు. పార్టీ కోసం పని చేసేవారికే పదవులు
వస్తాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని  హితవు
పలికారు . వెనుక బడిన వర్గాలకు చెందిన నలుగురు, కాపులు, రెడ్డి, ఎస్సీల్లో
ఒక్కొక్కరి వంతున ఆ పదవులకు ఎంపిక చేస్తామన్నారు. వైసీపీ కుల రాజకీయాలను
తిప్పికొట్టాలని, బీహార్‌ తరహాలో ఆంధ్ర ప్రదేశలో కుల ద్వేషాలు రగిలించేలా కుట్రలు సాగుతున్నాయని
ఆరోపించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos