ముంబయి: భారత్
పాక్‌ల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నప్పటికీ గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.46 గంటలకు సెన్సెక్స్ 83 పాయింట్లు లాభపడి 35,985 వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు లాభపడి 10,824 వద్ద ట్రేడయ్యాయి.
మందుల తయారీ సంస్థల షేర్లు లాభాల్లో ఉన్నాయి. కాడిల్లా హెల్త్‌కేర్, పిరమాల్ ఎంటర్ ప్రైజెస్ షేర్లు లాభపడ్డాయి. ఐడీబీఐ, ఓరియంట్ బ్యాంక్‌ల షేర్లు కూడా లాభాల్లో ఉన్నాయి. ఇక జెట్ ఎయిర్వేస్ షేర్లు దాదాపు నాలుగు
శాతం కుంగాయి. లీజు మొత్తం చెల్లించకపోవడంతో బుధవారం 4 విమానాల సర్వీసులను నిలిపివేయాల్సి వచ్చింది. రూపాయి విలువ గత ముగింపుతో పోలిస్తే 2 పైసలు పతనమైంది. బుధవారం కూడా రూపాయి విలువ 17పైసలు పతనమైంది.