‘దండుపాళ్యం’ చూసి… 14 రేప్ లు, 4 హత్యలు…

  • In Crime
  • February 28, 2019
  • 180 Views

ఈనెల 24వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండంల గుంటుపల్లి బౌద్దరామాల వద్ద జరిగిన శ్రీధరణి హత్య కేసుకు సంబంధించి కొద్ది రోజుల క్రితం నిందితుడు పొట్లూరు రాజును పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.హత్య కేసుపై విచారణ చేపట్టిన పోలీసులకు నిందితుడు పలు విస్మయకర అంశాలు,భయానక హత్య ఉదంతాల గురించి వెల్లడించాడు.కొద్ది సంవత్సరాల క్రితం కన్నడ, తెలుగు భాషల్లో విడుదలైన దండుపాళ్యం చిత్రాన్ని చూసి ప్రేరణ పొందిన రాజు సైకోగా మారాడు.దండుపాళ్యం చిత్రంలో చూపిన విధంగానే ప్రేమ జంటలే లక్ష్యంగా ఎంచుకొని దాడులు చేసేవాడు. కొద్ది సంవత్సరాల క్రితం ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లికి చెందిన తుపాకుల లక్ష్మి కుమార్తె గంగమ్మను వివాహం చేసుకున్న రాజు ఆరు నెలల క్రితం జి.కొత్తపల్లికి మకాం మార్చాడు. జీడితోటలకు కాపలాదారుడుగా ఉంటూ అక్కడి అటవీ ప్రాంతంలో పక్ష్లులను, జంతువులనూ వేటాడుతుండేవాడు. ఈ క్రమంలో తారసపడ్డ ప్రేమజంటల్ని బెదిరించి డబ్బు వసూలు చేస్తాడు. యువతిపై కన్నుపడిందంటే డబ్బులిచ్చినా తీసుకోడు. చంపుతానని బెదిరించి అత్యాచారానికి ఒడిగడతాడు. ఎదురు తిరిగితే ప్రాణాలు తీస్తాడు.ఇలా మొత్తం 14 మంది అమ్మాయిలపై అత్యాచారం చేసిన రాజు ఎదురు తిగిన నలుగురు అమ్మాయిలను అత్యంత కిరాతంగా హత్య చేసాడు.రక్తంతో తీవ్రంగా గాయపడి బాధపడుతున్న అమ్మాయిలపై వికృతంగా అత్యాచారం చేసి హత్య చేయడం నిందితుడు రాజు నైజం.గత ఆదివారం గుంటుపల్లి బౌద్ధారామాల వద్ద హత్యకు గురైన శ్రీధరణిని కూడా తీవ్రంగా గాయపరిచి అత్యాచారానికి పాల్పడ్డాడు. శ్రీధరణి, ఆమె ప్రియుడు దౌలూరి నవీన్‌ బౌద్ధారామాల వద్ద తారసపడడంతో వారిని బెదిరించి డబ్బు వసూలు చేశాడు. అనంతరం వారిపై దాడికి దిగాడు. తలపై బలంగా మోదడంతో నవీన్‌, శ్రీధరణి స్పృహతప్పి పడిపోయారు. కాసేపటికి శ్రీధరణి నేలపై పాక్కుంటూ తప్పించుకోవాలని చూడడంతో ఆమె కాళ్లు విరిచేశాడు. అనంతర అత్యాచారానికి పాల్పడ్డాడు.తీవ్ర గాయాలతో యువతి మరణించింది. నవీన్‌ కూడా చనిపోయాడు అనుకుని రాజు అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం నవీన్‌ ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos