600 పాయింట్లు పతనం : తిరిగి లాభాలు

600 పాయింట్లు పతనం : తిరిగి లాభాలు

ముంబై:దేశంలోని ఉద్రిక్తతల నడుమ స్టాక్ మార్కెట్లు ఊగిసలాటతో కొనసాగుతున్నాయి. ఆరంభం తరువాత కాసేపటికి ఇన్వెస్టర్లు ఆందోళనకు గురికావడంతో ఒక్కసారిగా అమ్మకాలు పరుగులు తీసాయి. సెన్సెక్స్‌ దాదాపు 226 పాయింట్లు పతనమైంది. ఇంట్రాడే గరిష్టం నుంచి సెన్సెక్స్‌ సుమారు 600 పాయింట్లుదిగజారింది. నిఫ్టీ కూడా 10800 స్థాయి నుంచి కిందికికూలింది. ఆ తర్వాత నష్టాల నుంచి కోలుకున్న సెన్సెక్స్‌ 26 పాయింట్లు ఎగిసి 36వేల స్థాయికి చేరుకుంది. నిఫ్టీ 10836 వద్ద ఉంది. పాక్‌ భారత్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొనడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆద్వర్యంలోని బ్యాంకులు తప్పా ఇతర అన్ని రంగాలూ బలహీన పడ్డాయి. ఐటీ, మెటల్, ఆటో, రియల్టీ 1-0.5 శాతం మధ్య క్షీణించాయి. విప్రో, టాటా మోటార్స్‌, వేదాంతా, ఇన్ఫ్రాటెల్‌, ఐవోసీ, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, కొటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టైటన్ బాగా నష్ట పోతున్నాయి. అల్ట్రాటెక్‌, బజాజ్ ఆటో, ఎన్‌టీపీసీ, యాక్సిస్, ఎల్‌అండ్‌టీ, సన్‌ ఫార్మా యూపీఎల్‌, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్ అదానీ పోర్ట్స్‌ లాభపడుతున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos