ఇస్లామాబాద్: అరబ్ దేశాల ప్రతిష్టాత్మక -ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) సదస్సును బహిష్కరించినట్లు
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మొహ్మద్ ఖురేషీ తెలిపారు. ఈ మేరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశాంగ మంత్రికి
కబురు చేసినట్లు వివరించారు. ‘‘యూఏఈ విదేశాంగ మంత్రితో మాట్లాడాను. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సమావేశానికి హాజరవుతుండడం పై ఆక్షేపణల్నీ
వ్యక్తీకరించాను ’’ అని ఖురేషీ పేర్కొన్నారు. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు విశిష్ట అతిథిగా ఈ సమావేశానికి
హాజరు కానున్నారు. భారత్ జరిపిన మెరుపు దాడులకు నిరసనగా ఈ నిర్ణయాన్ని
తీసుకున్నట్లు సమాచారం. ఐఓసీలో దాదాపు 57 సభ్యదేశాలు ఉన్నాయి. గతంలో అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా ఈ సమావేశంలో పాక్ కశ్మీర్ అంశాన్ని చర్చించడం పై భారత్ అనేక సార్లు అభ్యంతరం వ్యక్తం చేసింది. కశ్మీర్ పై ఐఓసీ మొదటి నుంచి పాక్‌కు సానుకూలంగా వ్యవహరిస్తోంది.