ఇద్దరు పైలెట్ల మృతి

ఇద్దరు పైలెట్ల మృతి

శ్రీనగర: జమ్ము కశ్మీర్‌లోని బుద్గాం పట్టణానికి ఏడు కి.మీల దూరంలోని గరెండ్‌ కలన్‌ వద్ద బుధవారంఉదయం  పోరాట విమానం-మిగ్‌  కుప్ప కూలింది. ఇద్దరు పైలెట్లు మృతి చెందారు.
విమానం కుప్ప కూలడంతో ఆ ప్రాంతమంతా మంటలు వ్యాపించాయి. అధికార యంత్రాంగా వెంటనే౦ రంగంలోకి దిగి సహాయకచర్యల్ని చేపట్టింది.  రోజువారీ సైనిక విన్యాసాల్లో ఈ దుర్ఘటన  సంభవించిందా లేక  యుద్ధ సన్నాహక కసరత్తులో  ప్రమాదం జరిగిందా అనే విషయం ఇంకా తేలాల్సి ఉంది. ప్రమాదంపై  ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos