న్యూఢిల్లీ : భారత వాయుసేన మంగళవారం వేకువ జాము జరిపిన సర్జికల్ స్ట్రైక్లో అనుభవానికి ప్రాధాన్యతనిచ్చింది. అధునికత కన్నా అనుభవమే ముఖ్యమని భావించింది. ప్రస్తుతం మన వైమానిక దళంలో సుఖోయ్ 30 ఎంకేఐ, తేజస్, మిగ్ 29 వంటి ఆధునిక యుద్ధవిమానాలు ఉన్నప్పటికి, ఈ దాడికి మిరాజ్నే ఎంచుకుంది. భారత వజ్రాయుధంగా పిలుచుకునే మిరాజ్ 2000లు, 1985లో భారత వైమానిక దళంలో చేరాయి. వీటిని దసాల్ట్ ఏవియేషన్ సంస్థ అభివృద్ధి చేసింది. అప్పుడు వీటికి ‘వజ్ర’ అని నామకరణం చేశారు. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో కూడా భారత్ వీటిని ఉపయోగించింది. ఈ యుద్ధంలో భారత దేశం విజయం సాధించడానికి కారణం మిరాజ్ 2000 విమానాలే. ఈ ఫలితంతో భారత ప్రభుత్వం మరిన్ని మిరాజ్ విమానాలను ఆర్డర్ చేసింది. ప్రస్తుతం భారత్తో పాటు ఎనిమిది దేశాలు ఈ విమానాలను ఉపయోగిస్తున్నాయి